తిరుపతిలో బీజేపీకి గాజు గ్లాసు గుర్తు టెన్షన్.. లోపాయికారీ ఒప్పందం అంటూ ?

తిరుపతిలో బీజేపీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. బీజేపీ – జనసేన కూటమి తరపున బీజేపీ అభ్యర్థి రత్నప్రభ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే జనసేన పార్టీకి ఇంకా గుర్తింపు లభించని కారణంగా ఆ పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించారు. అయితే బీజేపీతో పాటు ప్రచారం చేస్తున్న జనసేన జెండాలో సైతం గాజు గ్లాసు గుర్తు ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది.

దీంతో గాజు గ్లాసు గుర్తుతో జెండా ప్రచారం మీద జనసేన ఆలోచనలో పడింది. ఇక నిన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నవతరం పార్టీ మీద సంచలన ఆరోపణలు చేశారు. నవతరం పార్టీ వైసీపీకి బినామీ అంటూ  విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. గాజు గ్లాసు గుర్తు మీద ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. అయితే మేము బినామీలం కాదు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ వైసీపీ బినామీ అంటూ నవతరం పార్టీ ఆరోపిస్తోంది.