ఇప్పటి వరకు ఐపిఎల్ విజేతలు వీరే…!

-

ఐపీఎల్ మ్యాచ్లు అనగానే ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్ని పనులు ఉన్నా సరే ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు సాయంత్రానికి మ్యాచ్ చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఉద్యోగాల నుంచి త్వరగా వచ్చేస్తూ కాలేజీల నుంచి త్వరగా వచ్చేసి ఐపీఎల్ మ్యాచ్ల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఐపీఎల్ లో కొన్ని కొన్ని జట్లకు ఉండే అభిమానులు తమ జట్టు విజయం కోసం పూజలు కూడా చేసే పరిస్థితి ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఉంటుంది.

నేటి నుంచి ఐపీఎల్ 2021 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఏ జట్లు ఎన్నిసార్లు కప్పులు గెలిచాయి అనేది ఒకసారి చూద్దాం. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. 2009లో ఆడమ్ గిల్క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ చార్జెస్ విజేతగా నిలిచింది. 2010లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి ఐపీఎల్ విజేత గా నిలబడింది. వరుసగా రెండోసారి కూడా 2011లో చెన్నై గెలవగా 2012 లో గౌతం గంభీర్ సారథ్యంలోని కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.

2013లో ముంబై ఇండియన్స్ కప్ గెలిచింది. 2014లో మరోసారి కలకత్తా నైట్ రైడర్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2015 2019, 2020లో ఐపీఎల్ విజేతగా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ సారథ్యంలో కప్ ని ముద్దాడింది. ఇక డెక్కన్ చార్జెస్ హైదరాబాద్ కాస్త సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారి 2016లో కప్పు గెలవగా 2018 లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ ధోనీ సారథ్యంలో విజేత గా నిలబడింది.

ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా రెండు జట్లను చెప్తారు. ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ రెండు ముంబై ఇండియన్స్. అయితే ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై సూపర్ కింగ్స్ కొన్నాళ్లపాటు ఐపీఎల్ కి దూరం అయింది. ఈ సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫేవరెట్స్ గా ఉన్నాయి. అయితే మూడు జట్లు మాత్రం ఇప్పటి వరకు కప్పు గెలవలేకపోయాయి. పంజాబ్, బెంగళూరు, ఢిల్లీ. అగ్ర శ్రేణి ఆటగాళ్ళు ఉన్నా సరే గెలవలేదు.

Read more RELATED
Recommended to you

Latest news