ఏప్రిల్‌.. ఈ తేదీల్లో బ్యాంకులకు హాలీడేస్..!

-

న్యూఢిల్లీ: దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు సంబంధించిన సెలవు దినాలను రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. ఏప్రిల్ నెలలో మొత్తంగా 6 రోజులు బ్యాంకులు తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నాయి. ఆయా రాష్ట్రాల పండుగలు, సాధారణ సెలవులు పరిగణలో తీసుకుని సెలవుల పట్టికను తయారు చేస్తారు. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో ఒక్క సోమవారం మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. మిగిలిన రోజులు బ్యాంకు మూసివేయబడుతుంది. బ్యాంకింగ్ సెలవులు ఆయా రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగలు, అత్యవసర పరిస్థితులపై బ్యాంకుల సెలవులు ఆధారపడి ఉంటుంది.

banks
banks

బ్యాంకుల హాలీడే డేట్స్..
బ్యాంకులకు హాలీడే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 10వ తేదీన రెండవ శనివారం కాబట్టి ఆ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే ఏప్రిల్ 11వ తేదీన ఆదివారం, ఏప్రిల్ 13వ తేదీన గుధి పద్వా, ఉగాది పండుగ, సాజిబు నోంగ్మపన్బా(చెయిరోబా), బైసాకి, నవరాత్రి వంటి పండుగలు ఉన్నాయి. దీంతో ఈ రోజు బ్యాంకుకు హాలీడే ఉంటుంది. అలాగే ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సర దినోత్సవం, విషు, బీజు పండుగ, బోహాగ్ బిహు వంటి పండుగలు దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తారు. ఏప్రిల్ 15వ తేదీన హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ డే, బోహార్ బిహు, సర్హుల్ వంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. ఏప్రిల్ 16వ తేదీన బోహాగ్ బిహు వేడుకలు జరుగుతాయి. ఇలా మొత్తంగా ఏప్రిల్ నెలల 6 రోజులకు బ్యాంకుల హాలీడే ఉంటుంది. అందువల్ల ఆయా బ్యాంకుల వినియోగదారులు ఈ తేదీల్లో బ్యాంకులకు వెళ్లకపోవడం మంచిది. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు ఉంటే తొందరగా ముగించుకోండని ఆర్బీఐ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news