నేటి సమాజంలో చాలా మంది తమ ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం, ఆహారం, జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఉద్యోగం బిజీ, డబ్బు సంపాదించాలనే తపనతో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో శరీరంలో అనేక మార్పులు వస్తున్నాయి. అధిక బరువు పెరగడమే కాకుండా.. రోజంతా డల్‌గా ఉండిపోతారు. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. డాక్టర్స్ వద్దకు పరుగులు తీస్తూ డబ్బులు వృథా చేస్తున్నారు. అయితే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే.. రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యంగానూ ఉంటారు. అయితే అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.
శరీరానికి నీళ్లు చాలా ముఖ్యం. రోజుకు 3,4 లీటర్ల నీళ్లు తీసుకోవాలని పెద్దలు, నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు.. రోజుకు 12 నుంచి 14 గ్లాసుల నీరు తాగడం వలన డ్రీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటాము. అందుకే శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండాలి. ఎండకాలంలో మరింత ఎక్కువగా నీళ్లు తాగాలి. అలాగే మానసిక ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి సూర్యకాంతి చాలా అవసరం. సూర్యుడి నుంచి విటమిన్-డి లభిస్తుంది. ఇది శరీరానికి కాల్షియంను అందిస్తోంది. దీని వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. అందుకే రోజూ ఉదయం పూట కనీసం 15 నిమిషాల పాటు సూర్యకాంతిలో నిలబడాలి.
చాలా మందికి జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేసేంత టైం ఉండదు. దీంతో శరీరానికి శ్రమ ఉండకపోవడమే కాకుండా.. రోజంతా డల్‌గా ఉంటారు. ప్రతి రోజూ 10,000 లేదా అంతకంటే ఎక్కువ అడుగులు నడవడానికి ప్రయత్నించండి. నడవడం వలన ఉత్సాహంగా ఉంటారు. ప్రతిరోజూ కేవలం 15 నిమిషాలు వ్యాయమం చేయడం వలన మీ డే ఎంతో రిఫ్రెష్‌గా ఉంటుంది. కార్డియో వ్యాయామం చేయడం వల్ల గుండెకు చాలా మంచిది. ఇందుకోసం మీరు డ్యాన్స్, యోగా, సైక్లింగ్, రన్నింగ్ చేయవచ్చు. ఇలా వారానికి ఐదు సార్లు చేయడం ఉత్తమం.