తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకునే మార్పుల గురించి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది అనే దానిపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే ప్రచారం విషయంలో టీడీపీ నేతలు పూర్తిగా విజయవంతమయ్యారు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది.
వైసిపి అనుకున్న విధంగా పరిస్థితి లేదు అనే భావన ఇప్పుడు వైసీపీ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గనుక 50 వేల లోపు మెజారిటీతో ఓడిపోతే కచ్చితంగా చంద్రబాబు నాయుడు కొన్ని కీలక మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. కచ్చితంగా అదే జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతుంది.
కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొన్ని కీలక మార్పులకు రంగం కూడా సిద్ధం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా తిరుపతి నుంచే ఆయన కొన్ని మార్పులు మొదలుపెట్టవచ్చు. ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు కచ్చితంగా ఇన్చార్జిలను మార్చే ఆలోచనలో ఆయన ఉన్నారు. పార్టీ అగ్రనాయకత్వం ప్రచారం చేయడంతో అధికార పార్టీ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. కాబట్టి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనబడుతున్నాయి.