మీ సామాజిక ప్రవర్తన బాగుందా? ఒక్కసారి చెక్ చేసుకోండి..

-

మనం మనతో ఎలా ఉన్నా పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ, సమాజంతో ఎలా ఉంటున్నామనేది ముఖ్యంగా ఉంటుంది. నిజానికి మనతో మనం బాగున్నప్పుడే సమాజంలో మన ప్రవర్తన బాగుంటుంది. ఐతే మన గురించి వదిలేస్తే, నలుగురిలో తిరుగుతున్నప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవి చాలా చిన్న విషయాలే. కానీ ఎదుటివారిపై మనపై గౌరవం తీసుకువస్తాయి. అలాంటి లక్షణాలు మీకున్నాయా? ఒక్కసారి చెక్ చేసుకోండి.

హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్ళినపుడు తినే పద్దతిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం నమిలేటపుడు నోరు మూసుకుని నమలడం మంచిది. అవతలి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పద్దతిగా తినాలి.

టాయిలెట్ కి వెళ్ళినపుడు చేతులు శుభ్రపర్చుకోవడం కనీస ఇంగితజ్ఞానం. చాలా మంది ఇది కూడా మర్చిపోతారు.

ఇతరులు సలహా ఇమ్మని మీకు అడగనపుడు మీరు సలహా ఇవ్వవద్దు. అలా ఇచ్చినా వాళ్ళు తీసుకోరు. మిమ్మల్ని అడిగితే తప్ప నోరు విప్పకండి. దాని గురించి మీకెంత తెలిసినా సరే.

మీకు తెలిసిన అమ్మాయిలు లావుగా ఉన్నట్లయితే ఆ విషయాన్ని వాళ్ళతో చెప్పకండి. పొరపాటుగా కూడా ఇలాంటి విషయాలు డైరెక్టుగా చెప్పవద్దు.

ఎవరైనా నో చెప్తే దాన్ని ఒప్పుకోండి. ప్రతీ దానికి హద్దులు ఉంటాయని గుర్తించండి.

ప్రతీ ఒక్కరినీ సంతోషంగా ఉంచాలని అనుకోవద్దు. మీకు మీరు సంతోషంగా ఉండాలని అనుకోండి. కొందరు బాధల్లో నుండి బయటకి రావడానికి ఇష్టపడరు. అలాంటి వారి గురించి ఆలోచింది మీ ఆరోగ్యం పాడుచేసుకోవద్దు.

వ్యక్తిగత ప్రశ్నలు అడగవద్దు. అది మీకు సంబంధించినది కానపుడు అడక్కపోవడమే మంచిది. అందరూ ఒకేలా ఉంటారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news