మధ్యాహ్నం చిన్నపాటి కునుకు తీస్తున్నారా? ఐతే ఇది తెలుసుకోండి..

-

చాలామందికి మధ్యాహ్నం కునుకు తీసే అలవాటు ఉంటుంది. తినగానే డైరెక్టుగా పనిలోకి వెళ్ళకుండా కొద్దిసేపైనా బెడ్ మీద తలవాల్చి వెళ్ళాలని అనుకుంటారు. వేసవికాలంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు భగ భగ మండుతుంటే బయటకెళ్ళి పనులు చేయడం మంచిది కాదని చెప్పి, ఇంట్లో కునుకు తీస్తారు. ఐతే మధ్యాహ్నం పూట కునుకు తీయడం మంచిదా కాదా అనే దానిపై చాలా సందేహాలు ఉన్నాయి. కొంత మంది మధ్యాహ్నం పూట నిద్ర మంచిదే అని చెబితే, మరికొందరు అస్సలు మంచిది కాదు అంటారు.

మధ్యాహ్నం పడుకోవడం వల్ల రాత్రి నిద్రపట్టకుండా అవుతుందని, దానివల్ల ఆరోగ్యం చెడిపోతుందని చెబుతారు. అది నిజమేనా? కాదా అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిదే. కానీ ఎంతసేపు నిద్రపోతున్నావనే దానిమీదే అది మంచిదా కాదా అన్నది డిపెండ్ అవుతుందని అంటున్నారు. చిన్నపాటి కునుకు మంచిదే. అంతకుమించి మరీ మూడు నాలుగు గంటలు పడుకోవడం మంచిది కాదని నిపుణుల అభిప్రాయం.

చిన్నపాటి కునుకు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దానివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి దూరమైన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ అదుపులో ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావట. అంతే కాదు మానసికంగా కొత్త శక్తి వచ్చినట్లు అవుతుంది. పొద్దున్న పూట ఎంత ఎనర్జీగా ఉంటారో, మధ్యాహ్నం పూట నిద్రలేచిన తర్వాత అంతే ఎనర్జీతో ఉంటారు. కాకపోతే నిద్రా సమయం గంటను మించి ఉండకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువసేపు నిద్రపోతే అలసిపోయిన ఫీలింగ్ ఏర్పడి, ఏ పని చేసుకోనివ్వకుండా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news