విశాఖ పెందుర్తి మండలంలో ఆరుగురిని హత్య చేసిన కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు నిందితుడు అప్పలరాజు కుమార్తెతో విజయ్ అనే వ్యక్తితో 2018లో జరిగిన ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. విజయ్ చనిపోయిన బత్తిన రామారావు కుమారుడు. అయితే అప్పలరాజు కుమార్తెతో విజయ్ 2018లో ఫోన్ చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన అప్పలరాజు విజయ్ పై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో అప్పట్లో విజయ్ ను అరెస్టు కూడా చేశారు పోలీసులు. అనంతరం బెయిల్ మీద బయటకి వచ్చారు.
అయితే 2018 నుంచి విజయ్ పై కక్ష పెంచుకున్న హంతకుడు అప్పలరాజు, ఇదే వ్యవహారంపై విజయ్ కుటుంబాన్ని మొత్తం హతమార్చినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చనిపోయిన వారిలో విజయ్ భార్య ఉషారాణి, కుమారుడు ఉదయ్(2 సంలు) ఉర్విష(6 సంలు) కూడా హంతకుడు పొట్టన పెట్టుకున్నాడు. అయితే విజయ్ ఉద్యోగ నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడు. అయితే విజయ్ విజయవాడ నుండి వచ్చాడనుకొని వచ్చి అప్పలరాజు కుటుంబం మొత్తాన్ని అంతమొందించాడు.