పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. ప్రైవేట్ ఆసుపత్రిలో పవన్ ?

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వల్ప అస్వస్థత చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ కు ఊపిరితిత్తులలో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఏర్పడినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ టెస్టులు చేయించుకున్నట్లు సమాచారం. అయితే చేసిన పరీక్షల్లో కొద్దిపాటి ఇన్ఫెక్షన్ ఉందని డాక్టర్లు తేల్చి చెప్పినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో పవన్ కళ్యాణ్ కూడా క్వారంటైన్ లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే.

కొద్ది రోజులుగా ఆయన హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. అయితే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన ఆస్పత్రికి టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లిన నేపథ్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు బయటపడినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు తిరుపతి లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేశారు. ప్రస్తుతానికి కరోనా పాజిటివ్ అని ఎక్కడా తేలకపోయినా పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బందికి కరోనా సోకిన కారణంగా ఆయన ఐసోలేషన్ లోనే ఉంటున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news