ఆర్టీసీ కార్గోకు కోటిన్నర ఆదాయం.. ఎక్కడో తెలుసుకోండి!

-

కరోనా నేపథ్యంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించడానికి ప్రభుత్వం కార్గో సేవలను జూన్‌ 19న ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే దీన్ని వివిధ జిల్లాలో ప్రారంభించారు. కానీ, మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆర్టీసీ రీజియన్‌లో నయా ఆలోచనతో కార్గో సర్వీసులు మొదలు పెట్టింది. దీంతో వీరి సేవలకు మంచి ఆదాయం వచ్చింది. కేవలం పది నెలల్లో కోటిన్నర ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. తక్కువ కాలంలోనే పార్సిల్‌ కొరియర్‌ సేవలు అందిస్తూ రూ.1.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

 

మహబూబ్‌ నగర్‌ జిల్లాలో మొత్తం ఆరు కార్గో బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో రోజుకు రూ. 60 వేల ఆదాయాన్ని సమకూర్చుతున్నారు. అలాగే నిత్యం తిరిగే ప్రయాణికుల బస్సులో కూడా సరుకు పంపిస్తున్నారు.

కార్గో కొరియర్‌ ఏజెంట్లు 50 మందితో పాటు నిత్యం 62 మంది ఈ సేవలు నిర్వహిస్తున్నారు. 9 డిపోల్లో 21 కౌంటర్లు ఏర్పాటు చేశారు. రోజుకు 800– 900 వరకు పార్సిల్‌ కొరియర్‌ గమ్యస్థానానికి చేరవేస్తున్నారు.

జనవరి నాటికి డిపోల వారిగా వచ్చిన ఆదాయం మహబూబ్‌ నగర్‌ డిపోల్లో చేరవేసిన పార్సిల్లు కోరియర్లు 44,732.. ఆదాయం రూ. 32,75,232 , గద్వాల్‌ డిపో : పార్సిల్‌ 22,326. ఆదాయం రూ. 17, 59, 477 . జనవరి నాటికి డిపోల వారీగా వచ్చిన ఆదాయం ఇలా.. మహబూబ్‌ నగర్‌ డిపో లో చేరవేసిన పార్సిల్లు కోరియర్లు 44,732.. ఆదాయం రూ. 32,75,232 , గద్వాల్‌ డిపో : పార్సల్‌ 22,326. ఆదాయం రూ. 17, 59, 477 వచ్చింది.

నారాయణపేట డిపో కోరియర్లు 12,191 చేయగా ఆదాయం రూ. 7,34,801 వచ్చింది. షాద్‌ నగర్‌ డిపో : 11, 183 కొరియర్లకు ఆదాయం రూ. 11,04,858 వచ్చింది.

వనపర్తి డిపో పరిధిలో కొరియర్లు 14,455 , ఆదాయం రూ. 9,00,818 సమకూరింది. అచ్చంపేట డిపోలో పార్సిల్‌ కొరియర్లు 6,363 చేయగా ఆదాయం రూ. 4,04,949 వచ్చింది. కల్వకుర్తి డిపో కొరియర్లు 9,278 ..ఆదాయం రూ. 7,05,306 వచ్చింది.

కొల్లాపూర్‌ డిపో పార్సల్‌ కొరియర్లు 5, 797 చేయగా ఆదాయం రూ. 4,65,788 వచ్చింది. నాగర్‌ కర్నూల్‌ డిపో కొరియర్లు 10,215 చేయగా, ఆదాయం రూ. 6,51,418 సమకూర్చుకుంది.
ప్రస్తుతం కార్గో సేవలు జిల్లాలో 21 కౌంటర్ల ద్వారా విజయవంతంగా నిర్వహిస్తున్నామని.. రోజుకు రూ. లక్ష ఆదాయం లక్ష్యంగా , ప్రస్తుతం రోజుకు 60 వేలు దాటింది.
కార్గో సర్వీసు ద్వారా కోటిన్నర ఆదాయం వచ్చినందుకు ఆనందంగా ఉందని మహబూబ్‌ నగర్‌ ఆర్టీసీ ఆర్‌ఎం ఉషాదేవి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news