దేశవ్యాప్తంగా కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి. రోజుకు రెండు లక్షల కేసులు నమోదవుతున్న కారణంగా ఇప్పటికే ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొంది. తాజాగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కి కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ సమాచారాన్ని ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. ప్రకాష్ జవదేకర్ ట్వీట్ ఈ మేరకు ఉంది, “ఈ రోజు నాకు కరోనా పాజిటివ్ అని తేలింది, దీంతో గత 2-3 రోజుల్లో నాతో కాంటాక్ట్ లో ఉన్న వారు, దయచేసి టెస్ట్ చేయించుకోవాలని కోరారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకి కూడా రెండో సారి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. “తేలికపాటి జ్వరం వచ్చిన తర్వాత, నేను కరోనా పరీక్ష చేయించుకున్నా, నాకు పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది” అని ఆయన ట్వీట్ చేశారు. వైద్యుల సలహా మేరకు నేను ఆసుపత్రిలో చేరాను. ఇటీవలి కాలంలో నాతో కాంటాక్ట్ ఉన్న వారందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. వారు అప్రమత్తంగా ఉండాలి మరియు ఐసోలేషన్ లో ఉండాలని కోరారు.