12 వ తరగతికి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు CISCE ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలకు రాత పరీక్షను ఐచ్ఛికం చేసింది. కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తరువాత జూన్ 1వ తేదీన బోర్డు పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు. సీబీఎస్ఈ మాదిరిగా కాకుండా CISCE విద్యార్థులకు 10వ తరగతి పరీక్షకు హాజరుకావడానికి అవకాశం ఇచ్చింది. సీబీఎస్ఈ పరీక్షలను పూర్తిగా రద్దు చేసి కొత్త మోడల్ ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేయాలని నిర్ణయించింది. 10వ తరగతి విద్యార్థుల రాత పరీక్షలను నిలిపివేసి నిష్పాక్షికమైన క్రైటీరాన్ ఆధారంగా వారి ప్రతిభను అంచనా వేయనున్నారు.
గత సంవత్సరం CISCE పరీక్షలను రద్దు చేసినప్పుడు 3 అంశాల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేశారు. అప్పటి వరకు జరిగిన పరీక్షలలో సాధించిన మార్కుల సగటు, సబ్జెక్ట్ ప్రాక్టికల్, అంతర్గత మార్కుల ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించారు. ఇదే విధమైన పద్ధతిని ఇకపై కూడా అనుసరిస్తారని భావిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం అనుసరించబోయే అంచనా ప్రమాణాలను కౌన్సిల్ ఇంకా తెలియజేయలేదు. ఇప్పటివరకు 10వ తరగతి పరీక్షలు ఏవీ జరగలేదు. కాగా 12వ తరగతికి రెండు పరీక్షలను నిర్వహించారు.
కాగా భారత ప్రధాని నరేంద్రమోదీ, విద్యాశాఖ మంత్రిల మధ్య జరిగిన సమావేశం తరువాత కోవిడ్ -19 మహమ్మారి కారణంగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను నిలిపివేయాలని, 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. సీబీఎస్ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే CISCE 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే CISCE ఈ వివరాలను వెల్లడించింది.