మీకు వంట వండడం ఇష్టమా? మీరు చేసిన వంటకానికి అదనపు రుచిని తీసుకొచ్చే చిట్కాలు..

-

వంట చేయడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. రుచిగా చేయాలనీ, అది తిన్నవాళ్ళూ ఆహా ఎంత బాగుంది అని అంటే వినాలని తపనపడుతుంటారు. అలాంటి వారు కొన్ని విషయాలని తెలుసుకోవాలి. మీరు వండిన వంటకి వంక పెట్టకుండా ఎంత బాగుందీ అనే మాట రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

చాలామంది వంటవాళ్ళు మాంసం వండినపుడు ఫ్రిజ్ లో నుండి తీసి డైరెక్టుగా పొయ్యి మీద వేసేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. వండాలనుకున్న నిర్ణయం తీసుకున్న గంట, రెండు గంటల ముందే ఫ్రిజ్ లోంచి తీసి పక్కన పెట్టాలి. రెండు గంటలయ్యాకే పొయ్యి మీద వేస్తే బాగుంటుంది.

మృదువైన మాంసం కోసం

కొన్ని చోట్ల మాంసం తింటే చాలా బాగా అనిపిస్తుంది. నోట్లో ముద్ద పెట్టుకోగానే కరిగిపోయినట్టుగా ఉంటుంది. మాంసం అలా అవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఉప్పునీళ్ళలో కొద్ది సేపు మాంసాన్ని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాతే పొయ్యి మీద వేయాలి.

అప్పుడప్పుడూ ఉప్పు వేస్తూ ఉండాలి.

వంటకం రుచిగా అవడానికి ఉప్పు సరైన మోతాదులో వేయాలి. అలా వేయడం కుదరనపుడు వంటకం పొయ్యి మీద ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఉప్పు వేస్తూ ఉండాలి. ఎక్కువ ఎత్తు మీద నుండి చిలకరించినట్టుగా వంటకం మొత్తానికి వేస్తే అది బాగా పడుతుంది.

మాంసం రుచిగా ఉండాలంటే ఉడకడం ఇంపార్టెంట్. మాంసం ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. సరిగ్గా ఉడకబెట్టడం కూడా ఓ కళ. మంట పెద్దగా పెడితే సరిగ్గా ఉడకదు. కాబట్టి, మంట తక్కువగా పెట్టండి. తక్కువ మంట మీద ఎక్కువా సేపు ఉడకనివ్వాలి. అప్పుడే మాంసం సరిగ్గా ఉడికి రుచిగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news