ఎస్‌బీఐ అలర్ట్: డిజిటల్ ట్రాన్సక్షన్స్‌పై జాగ్రత్త..!

-

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులను హెచ్చరిస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాల బారి నుంచి సురక్షితంగా ఉండాలని సూచిస్తోంది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రారంభించడంతో బ్యాంకింగ్ సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, బ్యాంకుకు సంబంధించిన పాస్‌వర్డ్స్ మీ ఫోన్‌లో దాచుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదని చెబుతోంది. ఎస్‌బీఐతోపాటు మిగిలిన బ్యాంకులు, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా తమ వినియోగదారులకు డిజిటల్ ఫ్రాడ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.

sbi
sbi

పెరుగుతున్న మోసాల దృష్ట్యా..
ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు విస్తరించాయి. ఆన్‌లైన్ మోసాలు పెరగడంతో ఎస్‌బీఐ మరోసారి తన వినియోగదారులకు హెచ్చరించింది. బ్యాంకుల ఖాతాలకు సంబంధించిన వివరాలను తమ స్మార్ట్‌ఫోన్లలో సేవ్ చేసుకోవద్దని సూచిస్తోంది. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన పాస్‌వర్డ్, ఏటీఎం పిన్, డెబిట్, క్రెడిట్ కార్డు నంబర్లు, సీవీవీ నంబర్ సహా మిగిలిన సమాచారాన్ని వెంటనే తొలగించాలని హెచ్చరిస్తోంది. లేదంటే సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, అకౌంట్ హ్యాక్‌కి గురైతే మీ ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతాయని చెబుతోంది. అందుకే వెంటనే స్మార్ట్‌ఫోన్లలో బ్యాంకు వివరాలను తొలగించాలని చెబుతోంది.

బ్యాంకింగ్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్‌బీఐ తన వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని తగిన సూచనలు అందించింది. బ్యాంకులకు సంబంధించిన రహస్య సమాచారాన్ని తన స్మార్ట్‌ఫోన్లలో సేవ్ చేసుకోవద్దని, లేకుండా మీరు డిజిటల్ మోసాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్లలో బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తొలగించి.. సేఫ్‌గా ఉండాలంటోంది. ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా కాల్స్, మెసేజ్‌ల రూపంలో జరుగుతాయని, అన్‌నౌన్ పర్సర్న్ నుంచి కాల్స్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు రెస్పాన్స్ ఇవ్వకపోవడమే మంచిదంటున్నారు. అలాగే, మీ ఓటీపీ, పాస్‌వర్డ్స్ ఎవరితో షేర్ చేసుకోకూడదంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news