కరోనా వైరస్ సెకండ్ వైఫ్ ఎక్కువవడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనుంది. ఇప్పటి వరకు రెండు ఫేస్లు అయ్యాయి. ఇప్పుడు మూడవ ఫేస్ మే 1 నుంచి మొదలవుతుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాక్సిన్ వేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఈ వ్యాక్సిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫ్రీగా పొందొచ్చు. అదే మీరు ప్రైవేటు ఆసుపత్రిలో తీసుకోవాలంటే 250 రూపాయలు చెల్లించాలి. 18 ఏళ్లు పైబడిన వాళ్లకి మే 1 నుంచి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది కనుక ప్రాసస్ ఒకసారి తెలుసుకోండి. వ్యాక్సిన్ కొరత ఏర్పడిన తర్వాత నుంచి ప్రభుత్వం సరిపడా వ్యాక్సిన్స్ అందించడం జరిగింది.
వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి..?
ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సులభం. మీ ఫోన్ లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి https://selfregistration.cowin.gov.in/ ఈ లింక్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలి అక్కడ పోర్టల్ లో ఉన్న టైం ని బట్టి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్ లో నలుగురి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ చేసుకో లేకపోతే ఏం చేయాలి..?
రిజిస్టర్ చేసుకోవడం కష్టం అని మీరు అనుకుంటే ఇంటర్నెట్ కేఫ్ సహాయం తీసుకోవచ్చు అక్కడ తక్కువ చార్జి తోనే రిజిస్టర్ చేస్తారు.
మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే మీకు ఉండే పనిని బట్టి సమయాన్ని మార్చుకోవచ్చు. ఒక దగ్గర మీరు వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్నారు అనుకోండి మరో డోసు మీకు నచ్చిన చోట వేయించుకోవచ్చు. దానిలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే మొదటి డోసు ఏది తీసుకున్నారో అదే రెండవ డోసు కూడా తీసుకోవాలి. ఉదాహరణకు మీరు కో వ్యాక్సిన్ తీసుకుంటే రెండో దశలో కూడా అదే తీసుకోవాలి.
వాక్సినేషన్ సర్టిఫికెట్ అంటే ఏమిటి..?
వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకి వాక్సినేషన్ సర్టిఫికెట్ వస్తుంది. మీరు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ని పోర్టల్ లో పొందొచ్చు. మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రిప్ ఏవైనా వేస్తే ఆ సర్టిఫికెట్ బాగా ఉపయోగపడుతుంది.