దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ని పెంచుతూ ఆ రాష్ట్ర సిఎం అరవింద్ కేజ్రివాల్ నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన లాక్ డౌన్ పెంచుతున్నామని, ఆస్పత్రులకు ఆక్సీజన్ అందిస్తున్నామని ప్రకటించారు. ఢిల్లీలో కరోనా ఇంకా తగ్గలేదని చెప్పారు ఆయన. కరోనా కేసుల నేపధ్యంలో ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా లాక్ డౌన్ పెంచాలనే కోరినట్టు చెప్పారు.
పాజిటివిటీ రేటు 32% గా ఉందని ఆయన వెల్లడించారు. లాక్ డౌన్ తో కేసులు తగ్గుతున్నాయని చెప్పారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ ఉంటుందని కేజ్రివాల్ వివరించారు. ఏప్రిల్ 19 న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారు. ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, 70 శాతం మంది లాక్ డౌన్ పెంచాలని విజ్ఞప్తి చేసారు.