హనుమాన్ జయంతి.. ప్రాముఖ్యత.. విశేషాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు..

-

హనుమంతుడి పుట్టినరోజుని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం జయంతి ఉత్సవం ఏప్రిల్ 27వ తేదీన జరుగుతుంది. రామభక్తుడైన హనుమంతుడి జయంతిన చాలా పెద్ద ఎత్తున జరుపుతారు. ర్యాలీలు తీస్తూ జై శ్రీరామ్ అన్న నినాదాలతో భక్తులందరూ తన్మయత్వం పొందుతారు. హనుమంతుడి గుడి వద్ద అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ప్రతీ ఊరిలోనూ హనుమంతుడి గుడి తప్పక ఉంటుంది. ప్రతీ వారం వారం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఐతే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ర్యాలీలు, గుళ్ళో పెద్ద ఎత్తున సంబరాలు జరపడాలు నిషిద్ధం. అందువల్ల ఇంటి దగ్గరే హనుమంతుడి జయంతిని జరుపుకుంటున్నారు.

ప్రతీ ఏడాది చైత్రమాస శుక్ల పక్షమున 15వ రోజున హనుమాన్ జయంతి జరుపుతారు. ఈ రోజుని చైత్ర పూర్ణిమ అని కూడా పిలుస్తారు.

ప్రాముఖ్యత

వాల్మీకి రామాయణం ఉత్తరకాండ ప్రకారం త్రేతా యుగంలో వానర రాజైన కేసరికి హనుమంతుడు పుట్టాడు. కేసరి సతీమణి అంజని, విశ్వామిత్రుడి శాపం పొందింది. ఆ శాపం పోవడానికి శివుడిని పూజించి, తన గర్భంలో బిడ్డలా జన్మించమని కోరింది. ఆ ప్రకారం శివుడు అంజని గర్భంలో హనుమంతుడిలా పుట్టాడని నమ్ముతారు. హనుమంతుడిని వాయుపుత్రుడు అని కూడా అంటారు.

హనుమంతుడు పూజించే భక్తులందరూ ధైర్యసాహసాలు ప్రసాదించమని కోరుకుంటారు. అడ్డంకులను తొలగించి తామనుకున్న పని సక్రమంగా జరగాలని ప్రార్థిస్తారు. హిందూ మహాసముద్రాన్ని దాటి లంకని అంటించి వచ్చిన హనుమంతుడు పరాక్రమవంతుడు. ఆ పరాక్రమం తమలోని కలగజేయాలని, జీవితంలో వచ్చే ఇబ్బందులని దాటే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటారు.

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఇంట్లోనే పూజలు చేసి ఆ హనుమంతుడి ఆశీర్వాదం పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news