ఏబీఎన్ రాధాకృష్ణ ఇంట తీవ్ర విషాదం

ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ(63) కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనకదుర్గ ఆరోగ్య పరిస్థితి విషమంచడంతో ఈరోజు కన్ను మూశారు.

సాయంత్రం జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కనకదుర్గ మృతికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె అనారోగ్యానికి కారణం ఏమిటి అనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యానికి గాను చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఆమె మరణంతో ఆంధ్రజ్యోతి సంస్థల లో కూడా విషాదం నెలకొంది.