వరుడికి మూడు ముళ్లు వేసిన వధువు… ముంబైలో సంచలనం

-

ముంబై: సాధారణంగా హిందూ పెళ్లిల్లో వధువుకి వరుడు తాళి కడతారు. మూడు మూళ్లు వేసి జీవితభాగస్వామిని సొంతం చేసుకుంటారు. కానీ ముంబైలో రివర్స్‌లో జరిగింది. వరుడికి తాళి కట్టి వధువు వివాహం చేసుకుంది. ఇలా వరుడే చేయించుకున్నారు. వింటానికి వింతగా అనిపించినా ఇదే నిజం.

ముంబైకి చెందిన శార్ధుల్ కదమ్, తనుజ పాటిల్ నాలుగేళ్లు డేటింగ్ చేశారు. ఈ తర్వాత పెళ్లి చేసుకున్నారు. స్వతహాగా శార్థుల్ స్త్రీవాది(ఫెమినిస్ట్). పెళ్లి అంటే సమానత్వానికి ప్రతీక అని నమ్మేవారు. అంతే.. శార్దుల్‌కు ఒక ఆలోచన వచ్చింది. తన మెడలో తాళి కట్టించుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్నిపెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు చెప్పి ఒప్పించారు. గతేడాది డిసెంబర్‌లో తనుజను పెళ్లి చేసుకున్నారు.

అయితే పెళ్లి రోజు తనుజ మెడలో తాళి కట్టిన వెంటనే.. తన మెడలో కూడా ఆమెతో మంగళసూత్రం తొడిగించుకున్నాడు. దాంతో ఈ పెళ్లి స్థానికంగా సంచలనంగా మారింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు శార్దుల్‌పై విరుచుకుపడ్డారు. లింగ సమానత్వం చూపడానికి ఇది సరియైన మార్గం కాదంటూ  కామెంట్ చేశారు.

కానీ శార్ధుల్ అవేవీ పట్టించుకోలేదు. వివాహం జరిగి నాలుగు నెలలు గడిచినా తాళి బొట్టును తన మెడలోనే ఉంచుకున్నారు. ఇకపై కూడా తీయబోనని తాజాగా ఫేస్‌బుక్ వేదికగా తన పెళ్లి గురించి శార్దుల్ మరోసారి వివరణ ఇచ్చారు. అయితే కొందరు నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news