కరోనా నేపథ్యంలో SBI ఖాతాదారులు కాంటాక్ట్లెస్ సర్వీసులు ఇలా పొందండి…!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక రకాల సేవలను అందిస్తోంది. కస్టమర్స్ కి ఈ సేవల ద్వారా మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. అయితే తాజాగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎమర్జెన్సీ బ్యాంకింగ్ సర్వీసుల్ని అందించింది.

అయితే ఎస్బిఐ రెండు టోల్ ఫ్రీ నెంబర్లను ఇచ్చింది. 1800 112 211, 1800 425 3800 ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ తో కాంటాక్ట్ లెస్ సర్వీసుల్ని పొందొచ్చు. అయితే బ్యాంకు కి రావడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్ లతో సేవల్ని పొందొచ్చు అని అంది.

ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విటర్ లో చెప్పింది. బ్యాంకింగ్ అవసరాలకి సంబంధించి కస్టమర్లు ఈ టోల్ ఫ్రీ నెంబర్ లకు సంప్రదించవచ్చు అని వెల్లడించింది. రిజిస్టర్ మొబైల్ నుండి ఈ సేవలని పొందాలి.

ఈ నెంబర్ కి డయల్ చేసి అకౌంట్ బ్యాలెన్స్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఐవిఆర్ ని ఉపయోగించి లాస్ట్ 5 ట్రాన్సక్షన్స్ ని చూసుకోవచ్చు. ఏటీఎం కార్డు బ్లాక్ చేయడానికి, రీ ఇష్యూ చేయడానికి లేదా ఇతర సేవలని ఈ నెంబర్స్ కి కాల్ చేసి పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news