కరోనా పాజిటివ్ వచ్చిందా…? అయితే ఐదు నుండి పదవ రోజు వరకు చాల ముఖ్యం… ఎందుకంటే..?

-

కరోనా వైరస్ మహమ్మారి అయ్యి అందర్నీ పట్టి పీడిస్తోంది. ఇటువంటి సమయం లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పటికే అనేక మంది కరోనా బారిన పడ్డారు. ఎందరో కరోనా కారణంగా మరణిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వచ్చినప్పుడు ఐదో రోజు నుండి పదవ రోజు చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజులు జాగ్రత్తగా ఉంటే ప్రమాదం ఏమీ ఉండదు అని అంటున్నారు.

రెండవ దశ లో కలిగే లక్షణాలు ఏమిటి…?

మొదటి దశలో కరోనా వైరస్ వల్ల లక్షణాలు చాలా తక్కువగా కనిపించేవి కాని రెండవ దశలో నెమ్మదిగా వైరస్ సోకిన తర్వాత ప్రాణాంతకంగా మారుతోంది. 5 నుండి 7 రోజులు తర్వాత కరోనా వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది.

అలాగే ఏడు నుండి పది రోజులు ఇన్ఫెక్షన్ తగ్గిపోవచ్చు. లేదంటే క్రిటికల్ గా ఉండొచ్చు. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు ఆస్పత్రిలో అడ్మిట్ అవడం మంచిది. యాంటీ బాడీస్ ఈ సమయంలో ఎక్కువైపోయి ఒంట్లో ఇబ్బందులకు గురి చేస్తాయి. అందుకే ఐదు నుండి పది రోజులు చాలా ముఖ్యం.

14 రోజుల తర్వాత సాధారణంగా పేషెంట్ రికవరీ అయిపోతారు. వీళ్ళకి చాలా రిస్క్ ఉంటుంది. డయాబెటిస్, బీపీ, హృదయ సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు, వయసు ఎక్కువగా ఉన్నవాళ్లు మరియు ఒబిసిటీ కలవారికి దీని యొక్క రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ కనుక 7 నుండి 10 రోజుల్లో జ్వరం ఎక్కువగా ఉన్న, చెస్ట్ పెయిన్, శ్వాస ఆడక పోయినా, మానసిక సమస్యలు అంటే బ్లర్ లేదా అనవసరంగా మాట్లాడటం లాంటివి ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్లు తెలుసుకోవాలి అటువంటి సమయంలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news