బెజవాడ ఆస్పత్రులపై జగన్ స్పెషల్ ఫోకస్…?

కరోనా కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నా సరే కొందరు మాత్రం ప్రజల వద్ద నుంచి భారీగా వసూలు చేస్తూనే ఉన్నారు. ప్రజలు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే కొన్ని కొన్ని ఆస్పత్రులు మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. కోవిడ్ చికిత్సలో అవకతవకలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై శనివారం కూడా దాడులు జరుగుతున్నాయి.

శుక్రవారం మొత్తం 15 ఆస్పత్రుల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేసాయి. నాలుగు ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడట్లు నిర్ధారించారు. అవకతవకలకు పాల్పడ్డ ఆస్పత్రుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కేవీ. రాజేంద్రనాథ్ రెడ్డి ఈ దాడులను పర్యవేక్షిస్తున్నారు.