ఏపీ బడ్జెట్ లో ఇదే సంచలనం… జగన్ మార్క్ అన్నట్టు

-

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని శాసన సభలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి చదివి వినిపించారు. రెవిన్యూ లోటు..5000 కోట్లు గా ఉందని ఆయన చెప్పారు. ద్రవ్య లోటు.37,000 కోట్లు గా ఉందని మంత్రి వివరించారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం 6637 కోట్లు కేటాయించామని ఆయన అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కి 3673 కోట్లు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. ఇక ఈ బడ్జెట్ లో ఒక ప్రత్యేకత ఉంది.

తొలిసారిగా జెండర్ బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 2021-22 వార్షిక బడ్జెట్ లో 47 వేల 283 కోట్లు జెండర్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. చిన్నపిల్లలకు చైల్డ్ బడ్జెట్ లో 16,748.47 కోట్లు కేటాయించారు. బడ్జెట్ లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసారు. ఇక విద్యా, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగంపై ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news