రఘురామ కృష్ణం రాజు అరెస్టు ఇటు ఏపాతో పాటు అటు తెలంగాణలో కూడా వివాదాస్పమైంది. ఈ అరెస్టును ఖండిస్తూ ప్రతిపక్షాలు నిరసన గళం తెలుపుతున్నాయి. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు అరెస్టుపై విచారణ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం కీలక వాదన వినిపించింది. ఎంపీ రఘురామను తాము కావాలని అరెస్టు చేయించలేదని తెలిపింది.
ఎవరో వచ్చి ఆయనపై ఫిర్యాదు ఇచ్చేవవరకు ఊరుకోబోమని, ఆయన రాష్ట్రంలో గొడవలు జరిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ప్రభుత్వం తరఫున పిటిషనర్ తెలిపారు. అందుకే సీఐడీ అరెస్టు చేసిందన్నారు.
ఆయనపై కేసును సీఐడీ సుమోటోగా స్వీకరించిందని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదని పిటిషనర్ వివరించారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. సీఐడీ ఉంది ప్రభుత్వ ఆధీనంలోనే కదా.. మరి ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఎలా ఉంటుంది. పైగా నిన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కేసీఆర్‌పై రాజద్రోహం కేసు పెట్టలేదా.. ఇప్పుడు రఘురామపై పెడితే తప్పేంటంటూ వ్యాఖ్యానించారు. అంటే దీన్ని బట్టి వైసీపీ హస్తం ఉందనేగా.