వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో నేడు ఏపీఅసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదాలు తెలిపే సమయం లో నరసాపురం ఎం పి రఘురామ కృష్ణం రాజుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శలు చేసారు. పార్టీ గుర్తు, నాయకుడి ఫోటో తో రఘు రామ గెలిచారు అని ఆయన రాజీనామా చేస్తే వార్డ్ మెంబెర్ గా కూడా గెలవలేరు అంటూ కూడా వ్యాఖ్యలు చేసారు.
అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే వ్యాఖ్యలను అడ్డుకుని వేరే సభలో సభ్యుడు అయిన వ్యక్తి గురించి అసెంబ్లీలో విమర్శించడం తప్పు అని అన్నారు. దీనితో తాను మాట్లాడిన విషయాల్లో తప్పులుంటే రికార్డ్ ల నుండి తొలగించాలని స్పీకర్ ను కోరిన జోగి రమేష్ పై జగన్ ప్రసంశలు కురిపించారు. జోగి రమేష్ కు థాంక్యూ చెప్పాలి, అభినందించాలి అంటూ జగన్ వ్యాఖ్యలు చేసారు. జోగి రమేష్ బాధ లో ఆప్యాయత కనిపించింది….అతనికి థాంక్స్ అని అన్నారు. తాను తప్పుచేసి ఉంటే రికార్డ్ ల నుండి వాటిని తొలగించాలని స్పీకర్ ను కొరడం పై జగన్ అభినందించారు.