తెలంగాణాలో కరోనా పరిస్థితి నేపధ్యంలో సిఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గాంధీ ఆస్పత్రికి వెళ్ళిన సిఎం కేసీఆర్ అక్కడ రోగులను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. వార్డుల్లో తిరిగి ఎవరి పరిస్థితి ఏంటీ అని స్వయంగా చూసారు. వైద్యులతో కూడా ఆయన మాట్లాడారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సిఎం కేసీఆర్ వాళ్లకు ధైర్యం కూడా చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక నేడు వరంగల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉంటుంది. వరంగల్ ఎంజీఎంను సందర్శించనున్న కేసీఆర్… ముందుగా వరంగల్ సెంట్రల్ జైల్ ని పరిశీలిస్తారు. భోజనం అనంతరం ఎంజీఎం పర్యటన, అధికారులతో రివ్యూ ఉంటుంది. సెంట్రల్ జైల్ ప్రదేశానికి ఎంజీఎం తరలించే యోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నారు. ఇవాళ అధికారికంగా దీనిపై సిఎం కేసీఆర్ ప్రకటన చేస్తారు.