మన దేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ ఈ సారి మాత్రం ఆ ఎంజాయ్మెంట్ దక్కలేదనే చెప్పాలి. 2021లో ఐపీఎల్ 14వ సీజన్ ను బీసీసీఐ మన దేశంలో నిర్వహించినా.. మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ప్లేయర్లు, వారి సపోర్టు స్టాఫ్‌కు కరోనా రావడంతో మే4న నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
అయితే ఈ నేపథ్యంలో మళ్లీ ఐపీఎల్‌ను నిర్వహిస్తారా లేదే అనే ప్రశ్నలు అనేకం వచ్చాయి. ఇదే క్రమంలో ఐపీఎల్‌ను లండన్‌లో లేదా యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదనలు తెచ్చింది. అక్కడ కేసులు తక్కువగా ఉండటంతో ఆ దేశాల్లో ఒక చోట నిర్వహించాలన ఆలోచన చేసింది.
ఇక ఇప్పడు యూఏఈలో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బీసీసీఐ వైస్‌ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అన్ని రకాల కొవిడ్నిబంధనలతో మళ్లీ ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం ప్లేయర్లు కూడా సిద్ధంగా ఉన్నట్టు వివరించారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 10వరకు మిగిలిపోయిన 31 మ్యాచులను నిర్వహిస్తామని వివరించారు.
IPL has been moved to UAE for this season: Vice-President BCCI Rajeev Shukla to ANI pic.twitter.com/wqEukw6KGP
— ANI (@ANI) May 29, 2021