కోవిడ్ నుంచి కోలుకున్నారా ? అయితే ఈ టెస్టులను కచ్చితంగా చేయించుకోవాల్సిందే..!

-

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం కొంత వరకు తగ్గినట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ తగ్గుదల కనబడుతోంది. అయినప్పటికీ ఇంకా కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. రోజూ ఎక్కువ సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే కరోనా బారిన పడి చికిత్స తీసుకునే వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటున్న మాదిరిగానే కోవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. కింద తెలిపిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

covid recovered patients must take these tests

కోవిడ్‌ వచ్చిన వారిలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు విటమిన్‌ డి ట్యాబ్లెట్లను ఇస్తారు. అయితే కోవిడ్‌ నుంచి కోలుకున్న తరువాత చాలా మందిలో విటమిన్‌ డి లోపం సమస్య ఏర్పడుతుంది. కనుక కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు విటమిన్‌ డి టెస్టులను ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. లోపం ఉన్నట్లు తేలితే వైద్య సలహా మేరకు విటమిన్‌ డి మందులను వాడాలి.

కరోనా వల్ల ఊపిరితిత్తులపై అధిక భారం పడుతుంది. వైరస్‌ ఊపిరితిత్తులకు వ్యాప్తి చెందుతుంది. దీంతో ఊపిరితిత్తులు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కోవిడ్‌ నుంచి కోలుకున్నప్పటికీ కొందరిలో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడదు. అందువల్ల వారు ఊపిరితిత్తుల కోసం హెచ్‌ఆర్‌సీటీ స్కాన్‌ చేయించుకోవాలి. దీని వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. ఊపిరితిత్తు్ల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వైద్యుల సూచన మేరకు మందులను వాడుకోవాలి.

కరోనా వల్ల శరీరంలో వాపులు వస్తాయి. దీంతో ఆ ప్రభావం గుండెపై పడుతుంది. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు చాలామందికి గుండె సంబంధ సమస్యలు వస్తాయి. గుండె పనితీరు దెబ్బతింటుంది. కనుక కోవిడ్ నుంచి రికవరీ అయిన వారు గుండె సంబంధ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు ఎప్పటికప్పుడు తమ శరీర ఉష్ణోగ్రతను పరీక్షించుకోవాలి. బ్లడ్‌ ఆక్సిజన్‌ లెవల్స్‌, పల్స్‌ను చెక్‌ చేయాలి. శరీరంలో లవణాలు ఏ స్థాయిలో ఉన్నాయో టెస్టులు చేయించుకోవాలి. దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news