మొబైల్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. గూగుల్ క్రోమ్ కొత్త అప్డేట్తో మీ బ్రౌజింగ్ స్పీడ్ దాదాపు 23 శాతం పెరగనుంది. ఈ ప్రయోగాన్ని ఇటీవల క్రోమ్ 89ను అప్డేట్ చేసిన గూగుల్.. తాజాగా, ఐఓఎస్ వినియోగదారులకు క్రోమ్ 91 వెర్షన్‌ను రూపొందించింది. ఈ కొత్త అప్డేట్తో బ్రౌజింగ్ స్పీడ్ పెరగనుందని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ క్రోమ్ వాడకం చాలా సులభం. అందుకే ఇది ప్రఖ్యాతి గాంచింది. ఎప్పటికప్పుడు నయా ఫీచర్లతో తమ వినియోగదారులను ఆకట్టుకుంటేనే ఉంటుంది. ఈ సరికొత్త అప్డేట్తో బ్రౌజర్ మెరుపు వేగంతో పనిచేస్తుంది. ఇక దీనిలో పునరుద్ధరించిన నియంత్రణలు, పెద్ద స్క్రీన్ పరికరాల్లో డెస్క్‌టాప్ మోడ్ వంటి మార్పులను చేర్చింది.
తాజా అప్డేట్లోని స్పార్క్‌ప్లగ్ కంపైలర్, అంతర్నిర్మిత కాల్స్ ఫీచర్ కారణంగా క్రోమ్ ఇప్పుడు 23 శాతం వరకు వేగంగా పనిచేస్తుందని క్రోమియం బ్లాగ్ తాజా పోస్ట్‌లో గూగుల్ తెలిపింది. గూగుల్ క్రోమ్ అప్డేట్తో పనితీరును వేగంగా ఆప్టిమైజ్ చేసే టెక్నిక్‌ను ఉపయోగించింది. గూగుల్ అప్డేట్తో కొత్తగా చేర్చిన షార్ట్ ఇన్‌బిల్ట్ మెకానిజం బ్రౌజింగ్ వేగాన్ని పెంచుతుంది. అంతేకాక, కోడ్ మెమరీలో స్థానాన్ని ఆప్టిమైజ్ చేయడానికి V8 ఇంజిన్ కు సహాయపడుతుంది. ఈ అప్డేట్ యాపిల్ M1 చిప్‌సెట్‌తోనే పనిచేస్తుందని గూగుల్ స్పష్టం చేసింది. తద్వారా, యాపిల్ ఐఓఎస్ వినియోగదారులకు బ్రౌజింగ్ వేగం 23 శాతం మెరుగుపడుతుందని గూగుల్ పేర్కొంది.