కొత్త కోర్సును ప్రారంభించిన ఐఐటీ మద్రాస్‌

-

ఐఐటీ మద్రాస్‌ కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. టెక్నికల్‌ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా ఈ నయా కోర్సులను పరిచయం చేస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
సంస్థకు చెందిన రాబర్ట్‌ బాష్‌ సెంటర్‌ ఫర్‌ డేటా సైన్స్‌ అండ్‌ ఎఐ అప్లైడ్‌ డేటా సైన్స్‌ అండ్‌ మెషిన్‌ ఇంటెలిజెన్స్‌లో 12 నెలల పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్థాయి అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రాంను తాజాగా ప్రారంభించింది. టాలెంట్‌స్ప్రింట్‌ సంస్థ భాగస్వామ్యంతో ఈ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఐఐటీ మద్రాస్‌

ఆగస్టులో ప్రారంభమయ్యే పీజీ ప్రోగ్రాం మొదటి బ్యాచ్‌ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కోర్సు అర్హత, అప్లికేషన్‌ ఫీజు, ఇతర వివరాలకు iitm.talentsprint.com/adsmi/ వెబ్‌సైట్‌ చూడవచ్చు. ఆన్ లైన్లోనే దీనికి సంబంధించిన అప్లికేషన్‌ను దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది నాటికి డేటా సైన్స్‌, డేటా ఆర్కిటెక్చర్, డేటా ఎనాలసిస్, ఇంజనీరింగ్‌.. వంటి కోర్సులు మెరుగైన భవిష్యత్తు కోసం అవతరించనున్నాయని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం చెబుతోంది.

2026 ఏడాదికి ఈ విభాగంలో 11.5 మిలియన్ల కెరీర్‌ ఓపెనింగ్స్‌ ఉంటాయని యూఎస్‌ బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ సైతం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాసు ప్రారంభించిన కొత్త కోర్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. కోర్సులో నమోదు చేసుకునే అభ్యర్థులకు ఆన్లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. ఫైనాన్స్‌, హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, స్మార్ట్‌ సిటీస్‌ వంటి శిక్షణలు అందిస్తుంది.

మాస్టరింగ్‌ డేటా సైన్స్‌కు వ్యూహాత్మక విధానం అవసరమని చెబుతున్నారు ఖఆఇఈ అఐ హెడ్, కంప్యూటర్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ రవీంద్రన్‌. పరిశ్రమలోని యువ నిపుణులు బలమైన ఫండమెంటల్స్‌ నేర్చుకోవాలన్నారు. డేటా సైన్స్‌ రంగంపై ఆసక్తి ఉన్న వృత్తి నిపుణులకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది అంటున్నరు ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ రాజ్‌కుమార్‌. కేస్‌ స్టడీ ఆధారిత టీచింగ్‌ విధానం, ప్రోగ్రామ్‌ చివర్లో క్యాంపస్‌ విజిటింగ్‌ వంటి కార్యక్రమాలతో అభ్యర్థులు ప్రయోజనం పొందవచ్చని చెప్పారు. ఇక టెక్నికల్‌ కోర్సల్లో ట్రైనింగ్‌ పొందాలనే విద్యార్థులకు ఇదో మంచి అవకాశం.

Read more RELATED
Recommended to you

Latest news