నేడు రంగారెడ్డి జిల్లాలో వైయస్ షర్మిల పర్యటన..

తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 8వ తెదీన పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల దూకుడును పెంచారు.. ఈమేరకు రంగారెడ్డి జిల్లాలో వైయస్ షర్మిల పర్యటించనున్నారు. వికారాబాద్, పరిగి ప్రాంతాల్లోని రైతులతో ముచ్చటించనుంది. ఐకేపీ సెంటర్లలో నిలిచిపోయిన ధాన్యాన్ని పరిశీలించనున్నారు.

ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ధాన్యాన్ని తగల బెట్టిన రైతుల బాధలు తెలుసుకోనునున్నారు. మొత్తానికి పార్టీ ఆవిర్భావం నెల రోజులు ఉన్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్ళాలని బావిస్తున్నట్లు అర్థం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అడహక్ కేంద్రాల ఏర్పాటు జరగనుంది. ఈ మేరకు మరిన్ని పర్యటనలు ఉంటాయని వినిపిస్తుంది. మొత్తానికి షర్మిల రాజకీయ పార్టీపై అందరిలో ఆసక్తి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పార్టీ ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.