ఆన్‌లైన్‌లో ఉచితంగా కోర్సులు చ‌ద‌వాల‌నుకుంటున్నారా ? ఈ సైట్లు చూడండి..!

-

ఒక‌ప్పుడు అంటే.. ఏదైనా అంశం గురించి నేర్చుకోవాలంటే బ‌య‌ట ఏదైనా ఇనిస్టిట్యూట్‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. లేదా అందుబాటులో ఉన్న లైబ్ర‌రీని ఆశ్ర‌యించాల్సి వ‌చ్చేది. కానీ ప్ర‌స్తుతం టెక్నాల‌జీ మారింది. అర‌చేతిలోనే ప్ర‌పంచాన్ని చూపించే అద్భుత‌మైన సాంకేతిక‌త అందుబాటులో ఉంది. దీంతో మ‌న‌కు ఏ కోర్సు కావాల‌న్నా ఆన్‌లైన్‌లోనే చ‌దువుకునే వెసులు బాటు ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం అనేక కంపెనీలు త‌మ యాప్‌లు, సైట్ల ద్వారా మ‌న‌కు అనేక కోర్సుల‌ను ఉచితంగానే అందుబాటులో ఉంచాయి. అయితే కొన్నింటిలో మాత్రం కొన్ని కోర్సుల‌కు స్వ‌ల్ప మొత్తంలో రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

want to learn online courses then see these sites

ఆన్‌లైన్‌లో https://www.khanacademy.org/ అనే సైట్‌లో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని కోర్సుల‌ను ఉచితంగానే అందిస్తున్నారు. ఇక https://www.coursera.org/, https://stackskills.com/, https://www.codecademy.com/ త‌దిత‌ర సైట్ల‌లో కంప్యూట‌ర్లు, డిజిట‌ల్ ప‌రిజ్ఞానం, ఇత‌ర కోర్సుల‌ను నేర్చుకోవ‌చ్చు. అలాగే https://www.linkedin.com/learning, https://ed.ted.com/ అనే సైట్ల‌లోనూ ప‌లు కోర్సుల‌ను ఉచితంగా నేర్పిస్తున్నారు.

https://learndigital.withgoogle.com/digitalunlocked అనే సైట్‌ను గూగుల్ అందిస్తోంది. ఐఎస్‌బీ, భార‌త ప్ర‌భుత్వం, గూగుల్ సంస్థ‌లు స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌వేశపెట్టిన సైట్ ఇది.

https://online.stanford.edu/search-catalog, https://online.stanford.edu/search-catalog ఈ రెండు సైట్లు స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన‌వి. https://www.extension.harvard.edu/ ఇది హార్వార్డ్ యూనివ‌ర్సిటీ సైట్‌. దీంతోపాటు https://oyc.yale.edu/, https://www.classcentral.com/university/berkeley, https://ocw.mit.edu/index.htm, http://oli.cmu.edu/independent-learner-courses/ అనే యూనివ‌ర్సిటీల‌కు చెందిన సైట్ల‌లోనూ ఉచితంగా ప‌లు కోర్సుల‌ను నేర్చుకునే వెసులుబాటు ఉంది.

ఇక చిన్నారుల కోసం https://kids.nationalgeographic.com/ అనే సైట్ అందుబాటులో ఉంది. అయితే ఇవే కాదు, మీకు కావ‌ల్సిన ఏ అంశానికి చెందిన కోర్సు అయినా స‌రే యూట్యూబ్‌లో ఉచితంగా ల‌భిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీకు కంప్యూట‌ర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు కావాలంటే మీరు మీ మాతృభాష‌లోనే వాటిని నేర్చుకోవ‌చ్చు. అందుకు యూట్యూబ్‌లో ఎంతో మంది చాన‌ల్స్‌ను పెట్టి మ‌రీ ఉచితంగా ఆయా కోర్సుల‌కు చెందిన పాఠాల‌ను చెబుతున్నారు. క‌నుక ఏ కోర్సు కావాల‌న్నా ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో దాదాపుగా ఉచితంగానే నేర్చుకోవ‌చ్చు. కాక‌పోతే స్మార్ట్ ఫోన్‌, టాబ్లెట్ లేదా కంప్యూట‌ర్‌, మంచి ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉండాలి. అంతే..!

Read more RELATED
Recommended to you

Latest news