కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులతో సతమతమవుతారు, కరోనా వల్ల చాలా మంది పురుషులు పెద్ద పెద్ద గడ్డాలని పెంచుతూ ఉండిపోయారు. మరి కొందరైతే కొత్త రకాల హెయిర్ స్టైల్స్ ని ఆనందంగా స్వీకరిస్తే.. మరి కొందరు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే కరోనా సమయంలో గడ్డం పెంచడం వల్ల మంచిదా కాదా…? మరి ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. నిపుణులు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎవరికైతే పెద్ద గడ్డం అదే విధంగా ఒత్తుగా ఫేషియల్ హెయిర్ ఉంటుందో వాళ్లకి మాస్కు పెట్టుకున్నప్పుడు సరిగ్గా మాస్క్ సీల్ చెయ్యదు.
సులువుగా గాలి దాని నుండి వెళ్ళిపోతుంది. దీంతో మాట్లాడిన, శ్వాస తీసుకున్నా, దగ్గినా సులువుగా మాస్క్ నుండి బయటికి వెళ్లిపోతాయి. అదే విధంగా ఎవరైనా సరే తుమ్మినా, దగ్గినా, మాట్లాడిన ఆ డ్రాప్లేట్స్ ఈజీగా ఎంటర్ అయిపోవడానికి అవకాశం ఉందని వెల్లడించారు.
కాబట్టి అంత పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకోకుండా దాన్ని ట్రిమ్ చేయడం మంచిది. దీని వల్ల అందంగా ఉంటుంది మరియు సేఫ్టీ కూడా. ట్రిమ్మర్ ఉపయోగించి సులువుగా ఫేషియల్ హెయిర్ ని తొలగించుకోవచ్చు.
మీరు మీకు సూట్ అయ్యే విధంగా ట్రిమ్ చేసుకో వచ్చు. అలానే ఇప్పుడు వేసవి లో చెమట అవి ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి సమయంలో గడ్డాన్ని తొలగించుకోవడం మంచిది.