నిరుద్యోగులకు గుడ్ న్యూస్… విశాఖపట్నం ఈసీఐఎల్ (ECIL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజనీర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుప్రాజెక్ట్ ఇంజనీర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే..

 

ఇంటర్వ్యూలను జులై 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో చెప్పారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుంది.

ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో 8, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగంలో 12 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. ఇక అర్హత విషయం లోకి వెళితే.. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ కి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లోమో చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

60 శాతం మార్కులు ఉండాలి. అలానే ఈ విద్యార్హతతో పాటు అభ్యర్థులు న్యూక్లియర్ కంట్రోల్ సిస్టెమ్స్ లో మూడేళ్ల పాటు పని చేసిన అనుభవం కూడా ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 30 వేల వేతనం ఉంటుంది.

ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్ కి అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ట్రుమెంటేషన్ సబ్జెక్టుల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చెయ్యచ్చు.

అలానే అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల వేతనం అందించనున్నారు. పూర్తి వివరాలని ఇక్కడ చూడండి. http://ecil.co.in/jobs.html

ఇంటర్వ్యూలు నిర్వహించే చిరునామా: ECIL Regional Office, H.No. 47-09-28, Mukund Suvasa Apartments, 3rdLane Dwaraka Nagar, Visakhapatnam-530016.

 

Read more RELATED
Recommended to you

Latest news