దేశంలో రూ.104 దాటిన పెట్రోల్ ధర

-

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మరికొన్ని చోట్ల రూ. 100లోపే విక్రయాలు జరుగుతున్నాయి.

సోమవారం లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 104 దాటేసింది. భోపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ. 104.59 కాగా డీజిల్ రేట్ లీటర్ రూ.95.51గా ఉంది. ఇక లఢక్‌లో రూ. 101.96 పైసలు, డీజిల్ లీటర్ రూ.93.90గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102 కాగా డీజిల్ రూ.94.70గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 96.4 కాగా డీజిల్ 87.28గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ సోమవారం రూ.100.20గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 95.14గా సాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురుకు పెరిగిన డిమాండ్ వల్లే ఆయిల్ రేట్స్ పెరిగాయని వ్యాపారులు అంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news