భారీగా పడిపోయిన రైల్వే ఆదాయం

-

న్యూఢిల్లీ: రైల్వే శాఖకు ఫ్లాట్ పామ్ టికెట్లపై ఆదాయం భారీగా పడిపోయింది. కరోనా నేపథ్యంలో ప్రయాణాలు భారీగా తగ్గిపోయాయి. మరోవైపు ఫ్లాట్ ఫామ్ టికెట్ ధర పెంచడంతో ప్రయాణికులను ఊళ్లకు పంపేందుకు రైల్వే స్టేషన్లకు వచ్చేందుకు బంధువులు, స్నేహితులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం ఆదాయం తగ్గింది. గత సంవత్సరంతో పోల్చితే 94 శాతం పడిపోయింది. 2018-2019 సంవత్సరంలో రూ. 131 కోట్లు, 2019-2020లో ఫ్లాట్ టికెట్లపై ఆదాయం రూ. 160.87 కోట్లు రాగా ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ రూ. 10 కోట్లు వచ్చాయి.

కరోనా కారణంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఫ్లాట్ ఫామ్ టికెట్ ధరలను కొన్ని రైల్వే స్టేషన్లలో రూ. 10 నుంచి 30కు పెంచగా మరికొన్ని రైల్వే స్టేషన్లలో రూ. 50లకు పెంచారు. అయినా ఆదాయం భారీగా తగ్గిందని సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద ఓ వ్యక్తి అడగడంతో రైల్వే శాఖ సమాచారం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news