కాసేపట్లో రైతుబంధు ఖాతాల్లోకి నిధులు.. భారీగా పెరిగిన లబ్ధిదారులు

-

హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు పంపిణీకి వేళ అయింది. మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లోకి నిధులను డిపాజిట్‌ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఈ నెల 25 వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమ అవుతుంది. ఇప్పటికే ఆ ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. గతేడాది కంటే అదనంగా మరో రెండు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. మొత్తం 63 లక్షల 25 వేల మంది రైతులకు ఏడు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా భూ విస్తీర్ణం కూడా పెరిగి మరో అరవై ఆరు వేల ఎకరాలకు పైగా రైతు బంధు పరిధిలోకి వచ్చింది. ధరణి పోర్టల్ వచ్చాక పార్ట్ బి లోని భూములన్నీ పార్ట్ ఏ‌లోకి చేరాయి. పెండింగ్ లో ఉన్న మ్యుటేషన్లు కొన్ని పరిష్కారం అయ్యాయి. అపరిష్కృతంగా ఉన్న కొన్ని భూములకు ఆమోదం లభించడంతో లబ్ధిదారుల జాబితా పెరిగింది.

పంటలు వెయ్యని వారికీ ప్రతి సీజన్‌లో రైతుబంధు పేరుతో ప్రభుత్వ సాయం అందుతోంది. పంటలు వెయ్యని వారికి ఆర్థిక సాయం ఎందుకనే చర్చ కూడా సాగింది. సాగు చేయని, భూస్వాముల చేతుల్లో ఉన్న భూమిని.. రైతుబంధు పరిధి నుంచి తొలగించాలని కొందరు ప్రజాప్రతినిధులే అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన బడా రైతుల చేతిలో ఉన్న భూమికి రైతు బంధును ఆపేస్తే..ప్రతి సీజన్‌లో ప్రభుత్వానికి 4 వేల 592 కోట్లు ఆదా కానున్నాయి. కరోనా కష్టకాలంలో ..ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news