కరోనా వచ్చాక ఎలక్ట్రానిక్ పరికరాల మీద ఆధార పడడం పెరిగిపోయింది. బయటకు వెళ్ళే వీలు లేదు కాబట్టి ఇంట్లో ఉండే బయట వారందరితో ఫోన్లో మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల ఎక్కువ గంతలు ఫోన్లు చేతుల్లోనే ఉంటాయి. ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం అధికమైపోయి అనవసర ఒత్తిడిని పెంచింది. దీన్నుండి బయటపడి సాధారణ జీవితాన్ని గడిపెందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
తెల్లారగానే ఫోన్ ముట్టుకోవద్దు
నిద్రలేవగానే ఫోన్ ముట్టుకోవడం చాలా మందికి అలవాటు. కానీ అది మంచిది కాదు. దీనివల్ల మెదడు మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. అంతేకాదు పనిలో నైపుణ్యం బాగా తగ్గుతుంది. అందుకే వ్యాయామం చేసే వరకు, లేదా బ్రేక్ ఫాస్ట్ అయ్యే వరకు సెల్ ఫోన్ ముట్టుకోవద్దు.
నిద్రపోయే ముందు ఫోన్ ముట్టుకోవద్దు
పడుకునే ముందు ఫోన్ వాడకం నిద్రమీద ప్రభావం చూపుతుంది. నాణ్యమైన నిద్ర కావాలనుకున్న వారు నిద్రపోవడానికి 45నిమిషాల్ ముందే ఫోన్ ని పక్కన పెట్టేయాలి. అదీగాక రాత్రిపూట ఫోన్ వాడేవారు బ్లూ లైట్ ఫిల్టర్ ని ఉపయోగించాలి. దానివల్ల కళ్ళమీద నీలి కాంతి ప్రభావం తక్కువగా ఉంటుంది.
కళ్ళకి విశ్రాంతి ఇవ్వండి
ఉదయం నుండి సాయంత్రం వరకు తెరని చూస్తూ కూర్చుంటే కళ్ళు అలసిపోతాయి. అందుకే అప్పుడప్పుడు బయటకి రావాలి. పచ్చని వాతావరణాన్ని చూడాలి. దానివల్ల కళ్ళకొ కొంత ఉపశమనం కలుగుతుంది. అలా కాకుంటే అరచేతులని ఒకదానికొకటి రుద్ది వేడి కలగగానే కళ్ళ మీద ఉంచాలి. ఒక ఐదు సెకన్ల పాటు ఉంచి, కళ్ళు తెరిచేటపుడు రెప్పలు మూస్తూ తెరవాలి.
ఆఫ్ స్క్రీన్ పనుల్లో భాగం అవ్వండి
ఎప్పుడూ ఫోన్లో ఆడే ఆటలే కాకుండా ఆఫ్ స్క్రీన్ ఆటలపై దృష్టి పెట్టండి. చిన్న పిల్లలతో సరదాగా ఆడే ఆటలు మీలో కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తాయి. పని చేయడానికి కావాల్సిన శక్తి వస్తుంది.