తెల్ల జుట్టు తో బాధపడుతున్నారా..? అయితే ఈ టిప్స్ మీకోసం..!

-

చాలా మంది తెల్ల జుట్టు తో బాధ పడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఇక్కడ కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే తెలుసుకుందాం. ఇది వరకు పెద్ద వాళ్ళకు మాత్రమే తెల్ల వెంట్రుకలు వచ్చేవి. కానీ ఇప్పుడు యువతలో కూడా జుట్టు తెల్లగా అయిపోతోంది. దీనికి గల కారణం ఏమిటంటే..? సరైన జీవన విధానం లేక పోవడం, మంచి ఆహారపు అలవాట్లు లేక పోవడం.

తెల్ల జుట్టు / hair

అయితే తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండాలంటే వీటి పై కాస్త శ్రద్ధ పెట్టాలి. అదే విధంగా హానికరమైన కెమికల్స్ ఉండే ప్రొడక్ట్స్ ని వాడకూడదు. వాటి వల్ల జుట్టు కి సమస్యలు వస్తాయి. తెల్ల జుట్టు బారిన పడకుండా ఉండాలి అంటే ఈ ఇంటి చిట్కాలు ప్రయత్నం చేసి చూడండి. మరి ఇక దాని కోసం చూస్తే..

దీని కోసం మీరు కొద్దిగా తులసి ఆకులు తీసుకోండి.
కొద్దిగా ఉసిరి కాయలను లేదా ఉసిరి జ్యూస్ ని తీసుకొని తులసి ఆకులు లో వేసేయండి.
అలానే బృంగరాజ్ ఆకులని కూడా తీసుకుని ఆ జ్యూస్ లో కలపండి.
వీటిని అన్నింటినీ కూడా బాగా కలిపి మీ జుట్టుకి అప్లై చెయ్యండి.

ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా అవుతుంది. కరివేపాకు కూడా జుట్టుని నల్లగా మారుస్తుంది. కావాలంటే మీరు కరివేపాకుతో నూనె చేసుకొని కూడా వాడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news