IVF ఫెయిల్యూర్ రిస్క్ ని ఇలా తగ్గించుకోండి…!

-

Recurrent Implantation Failure (RIF) అంటే మంచి నాణ్యత గల పిండాలను మహిళ పొందలేదు. ఇలా కొన్ని కారణాల వలన మహిళ నాణ్యత గల పిండాలను పొందదు. హైదరాబాద్‌ లోని నోవా ఐవిఎఫ్ ఫెర్టిలిటీ, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ హిమా దీప్తి ఐవిఎఫ్ వైఫల్యానికి కారణాన్నిచెప్పారు.

RIF/IVF ఫెయిల్యూర్ కి కారణాలు:

ఇంప్లాంటేషన్ వైఫల్యానికి ఇతర కారణాలు ఉన్నప్పటికీ ప్రధమ కారణం పిండం. మంచి నాణ్యమైన పిండమా కాదా అనేది morphological పద్దతి ద్వారా చూస్తారు. అయితే కొన్ని సార్లు పిండం ఆరోగ్యంగా కనపడిన జన్యుపరంగా అసాధారణంగా మారుతుంది. IVF యొక్క విధానాన్ని అనుసరించి ఉత్పత్తి చేసినప్పటికీ పిండాల శాతం క్రోమోజోమల్‌గా అసాధారణంగా మారుతుంది.

సర్రోగసీ మరియు టెస్ట్ ట్యూబ్ పద్ధతుల్లో ఏది మంచిది..?

గర్భాశయ ఫైబ్రాయిడ్లు, గర్భాశయ పాలిప్స్, ఇంట్రా-గర్భాశయ అంటువ్యాధులు, గర్భాశయ సంశ్లేషణలు మొదలైన వాటి వలన సమస్యలు వస్తాయి. sexually transmitted infections వలన కూడా సమస్య ఉండచ్చు.

నెగటివ్ ప్రెగ్నన్సీ టెస్ట్ తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రయత్నించాలి..?

ఇది చాలా అరుదుగా జరిగేది కాదు. చాలా మందిలో ఈ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. మొదటి ఐవిఎఫ్ పద్ధతి సక్సెస్ అవ్వకపోవడం లో ఆశ్చర్యం లేదు. చాలా మంది మహిళలు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. ఒకవేళ మహిళకి 30 ఏళ్లు దాటినా 40 ఏళ్ళు వచ్చేసినా సరే ఫెయిల్యూర్ ఉంటుంది. ఒకవేళ కనుక ఇది ఫెయిల్యూర్ అయితే భార్య భర్తలు డాక్టర్ ని కన్సల్ట్ చేసి మాట్లాడటం మంచిది.

ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఐవిఎఫ్ పద్ధతి విజయవంతం అవుతుంది..?

ఇలాంటి విషయాలు చర్చించుకోవాలి. ఆ తర్వాత మరొక సారి ఎప్పుడు చేయించుకోవాలి అనేది తెలుసుకోవాలి. గుడ్డిగా అనుసరించడం కంటే ఇటువంటి వాటిపై అవగాహన ఉండడం మంచిది. ఒక నెల గ్యాప్ తీసుకుని మళ్ళీ ఐవీఎఫ్ పద్ధతిని పాటించడం మంచిది.

ఐవీఎఫ్ పద్ధతి రిస్క్ తగ్గాలంటే ఏం చేయాలి..?

మీ TSH (థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్) ను టెస్ట్ చేయించుకోండి.
ఊబకాయం లేదా అధిక బరువు కలిగి ఉంటే, వారు ఐవిఎఫ్ విధానానికి మూడు నెలల ముందు కొంత బరువును తగ్గాలి.
hysteroscopy ని ఉంచుకోండి.
మద్యం తీసుకోవడం తగ్గించండి మరియు ధూమపానాన్ని పూర్తిగా తగ్గించండి.
పోషకాహారం తీసుకోండి. ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవద్దు.
ఎక్కువ మిస్ క్యారేజ్ వంటివి ఉంటే జన్యు పరీక్ష అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news