యూపీ: ఇద్దరు పోలీసుల అత్యుత్సాహం వారి ఉద్యోగలపైకి వచ్చింది. విధుల్లో హుందాగా ఉండాల్సిందిబోయి చిల్లరగా వ్యవహరించారు. అధికారుల ఆగ్రహానికి గురయ్యారు. ప్రమాదంలో ఇద్దరు బైక్ రైడర్లు మరణించినందుకు ఉనావోలో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్విరావు. ఈ అల్లర్లలో 12 మంది పోలీసులు గాయపడ్డారు.
అయితే ఇద్దరు పోలీసులు మాత్రం హాట్ టాపిక్ అయ్యారు. ఒకరు హెల్మెట్‌కు బదులు తలకు కుర్చీ, మరొకరు రక్షణ తడికకు బదులు చేతిలో బుట్టను పట్టుకుని అల్లర్లను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకూదని పోలీసులకు సూచించారు.