మాజీ ప్రధాని దేవె గౌడకు షాక్.. భారీ జరిమానా వేసిన కోర్టు

-

మాజీ ప్రధాని దేవె గౌడ కు ఊహించని షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో భాగంగా బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు భారీ జరిమానా విధించింది. పరువు నష్టం కేసులో నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఇంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని దేవె గౌడను ఆదేశించింది. 2011 జూన్ లో కన్నడ వార్త ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవె గౌడ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సంస్థ తమ పరువుకు భంగం వాటిల్లింది అంటూ పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన సివిల్ కోర్టు న్యాయమూర్తి రెండు కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

దేవగౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ఇదే కేసులో గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దేవెగౌడ పిటిషన్ను కొట్టివేసింది. అయితే తాజాగా ఈ కేసును విచారించిన బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు.. రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news