చిరు, వినాయక్ సినిమా త్వరలో..?

-

డైరెక్టర్ వివి వినాయక్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఠాగూర్, ఖైదీ నెం.150 సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. దీంతో వారి ఇమేజ్ మరింత పెరిగిపోయింది. అటు అభిమానులు కూడా వీరి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలో  ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చిరంజీవి నటించబోయే ‘లూసీఫర్’సినిమా రీమేక్ బాధ్యతలను వినాయక్‌కు అప్పగించారని అనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. అయితే తాజాగా చిరుతో ఓ మూవీ చేయాలని వివి వినాయక్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వివి వినాయక్ క్రేజ్ చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోలు వినాయక్ దర్శకత్వంలో నటించాలంటే ఎగిరి గంతేసేవారు. కాని ఇప్పుడు వినాయక్‌పై ఆసక్తి చూపడం లేదు. దీంతో చిరంజీవితో మళ్లీ ఒక సినిమాను చేసి సక్సెస్ కొట్టి టాలీవుడ్‌లో తన సత్తా చాటాలని వినాయక్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. చిరంజీవి ఇష్టపడే కథలను సిద్దం చేసుకునే పనిలో ఉన్నారట. ఈ మేరకు సొంత కథలతో పాటు కొన్ని రీమేక్ స్క్రిప్ట్ లను కూడా వినాయక్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి వినాయక్ ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news