హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు, లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతో పాటు అటవీశాఖ జిల్లాస్థాయి అధికారులు, సంరక్షకులు కూడా హాజరయ్యారు. జూలై 1 నుంచి చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతితో పాటు హరితహారంపైనా కేసీఆర్ చర్చిస్తున్నారు.
కాగా పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, హరితహారం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సారి హరితహారంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులకు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది.