టాలీవుడ్‌లో మా ఎలక్షన్స్ (MAA Elections) జోరు ఊపందుకుంది. ఈ సారి పెద్ద నటీనటులు అధ్యక్ష పదవికి పోటీ పడటంతో ఎలక్షన్స్ వేడి మీదున్నాయి. అయితే ఇప్పుడు అందరూ ప్రముఖ నటుడు అయిన ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన నాన్ లోకల్ అంటూ విమర్శిస్తున్నారు. స్థానికులకే పట్టం కట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు మంచు విష్ణు పెద్దలను కలుస్తూ పావులు కదుపేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే తనను నాన్ లోకల్ అనడంపై ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు. తాను గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు గానీ లేదా తన నటనకు తొమ్మిది నంది అవార్డులు, అలాగే జాతీయ అవార్డులు వచ్చినప్పుడు ఎందుకు నాన్ లోకల్ అని చెప్పలేదంటూ ప్రశ్నించారు. ఇక ఇదే విషయంలో సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ప్రకాష్ రాజ్‌కు అండగా నిలిచారు.
ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయితే ఇండస్ట్రీలో పెద్ద హీరోలైన రామారావు, నాగేశ్వర్‌రావు, సూపర్ స్టార్ కృష్ణ, మోహన్‌బాబు లాంటి వారంతా ఎలా లోకల్ అయ్యారంటూ చురకలంటించారు. అలాగే దేవుండ్లయిన రాముడు, సీత కూడా నాన్ లోకలే అంటూ చెప్పారు. నటుడు ప్రకాశ్ రాజ్ నటనకు దేశమే గర్వపడుతోందని, అలాంటి వ్యక్తిని నాన్ లోకల్ అంటే దేశానికే వ్యతిరేకం అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ఇన్ డైరెక్టుగా మంచు ఫ్యామిలీకి, జీవిత రాజశేఖర్ ప్యానెల్‌కు కౌంటర్ వేసినట్టు కనపడుతోంది.
మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ non లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. bruce lee non local..రాముడు సీత కూడా నాన్ లోకల్ .. @prakashraaj also Non Local #MAAelections
— Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021