పాన్ కార్డు ఉన్నవాళ్ళకి కాస్త ఊరటని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పాన్ కార్డు ఉన్నవాళ్ళకి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళ్ళిపోతే.. తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దీంతో పాన్ కార్డు కలిగిన వారికి భారీ ఊరట కలుగనుంది అనే చెప్పాలి. మామూలుగా కేంద్రం పాన్ ఆధార్ లింక్ చేసుకోమన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సర్కార్ ఆ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో ఇంకా పాన్ ఆధార్ లింక్ చేసుకోని వారికి మరింత గడువు అందుబాటులోకి వచ్చింది కనుక ఏ కంగారు లేకుండా రిలీఫ్ గా ఉండచ్చు. తాజాగా మార్చిన తేదీ ప్రకారం సెప్టెంబర్ 30 వరకు పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి సమయం వుంది.
మామూలుగా అయితే ఈ గడువు జూన్ 30తో ముగించాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పాన్ ఆధార్ లింక్ గడువును మరో 3 నెలలు పొడిగించింది. సెక్షన్ 139 ఏఏ ప్రకారం.. పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ వారి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాల్సిందే.
కనుక ఇంకా ఎవరైనా లింక్ చెయ్యక పోయి ఉంటే త్వరగా ఆధార్ తో పాన్ ని లింక్ చేసుకోవడం మంచిది. లేదు అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.