ఢిల్లీ: సంవత్సరం తర్వాత మొదటి సారి అత్యంత తక్కువకు కరోనా కేసులు…

-

కరోనా సెకండ్ వేవ్ దేశ రాజధాని ఢిల్లీని అల్లల్లాడించింది. వేగంగా పెరిగిన కేసులు, పడిపోతున్న ప్రాణాలు ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఒకానొక సమయంలో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో కేసుల సంఖ్య బాగా తగ్గింది. రెండంకెల సంఖ్యకి పడిపోయింది. అవును, గడిచిన 24గంటల్లో ఢిల్లీలో వచ్చిన కరోనా కేసుల సంఖ్య 85గా ఉంది. ఈ మేరకు ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు విడుదల చేసింది. సంవత్సరం తర్వాత ఇంత తక్కువ మొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి.

ఈ 85కేసులతో మొత్తం కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 1,433,675, కి చేరింది. అలాగే 9మంది కరోనా కాటుకి బలవడంతో మృతుల సంఖ్య 24,961గా ఉంది. మొత్తం కేసులలో ఇది 1.74% గా కనిపిస్తుంది. 158మంది రికవరీ కావడంతో కరోనాని జయించిన వారి సంఖ్య 1,407,116కి ఎగబాకింది. ఇది మొత్తం రికవరీ రేటులో 98.15% అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తానికి కరోనా కేసుల తగ్గుదల శుభపరిణామంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news