ట్రావెల్: యూరప్ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ లిస్టులో కోవిషీల్డ్ కి దక్కని అనుమతి

-

కరోనా వల్ల ఇతర దేశాలకు వెళ్ళాలంతే వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న సర్టిఫికేట్ అడుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏ దేశానికి వెళ్తున్నారో, ఆ దేశం వారు కొన్ని ప్రత్యేక వ్యాక్సిన్లు తీసుకున్న వారిని మాత్రమే తమ దేశంలోకి రావడానికి అనుమతి ఇస్తున్నారు. యూరోపియన్ యూనియన్, తాజాగా వ్యాక్సిన్ల పాస్ పోర్టు లిస్టుని ప్రకటించింది. అందులో ఇండియాకి చెందిన కోవిషీల్డ్ లేకపోవడం గమనార్హం. పూనేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవీషీల్డ్ ని తయారు చేసింది.

ఐతే ఈ వ్యాక్సిన్ ఫార్ములా మాత్రం ఆస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ వారిదే. ఇది యూరప్ కి చెందిన కంపెనీయే. యూరోపియన్ యూనియన్ వ్యాక్సిన్ పాస్ పోర్టుకి అనుమతి లభించిన వ్యాక్సిన్లలో ఫైజర్, మోడెర్నా, వ్యాక్స్ జెవిరియా, జాన్సన్ ఉన్నాయి. చిత్రమేమిటంటే ఇందులో ఉన్న వ్యాక్స్ జెవిరియా వ్యాక్సిన్ ని కూడా ఆస్ట్రాజెనికా ఆక్స్ ఫర్డ్ తయారు చేసింది. మరి దీనికి కారణాలేంటన్నది ఇంకా తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news