తెలంగాణ: ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై సబితా ఇంద్రారెడ్డి సమావేశం నేడే..

-

కరోనా కారణంగా విద్యాశాఖ తీవ్ర అయోమయంలో చిక్కుకుంది. తరగతులు ఎప్పటి నుండీ మొదలు పెట్టాలి? అసలు మొదలు పెట్టాలా వద్దా? పరీక్షలు నిర్వహించాలా?, రద్దు చేయాలా? వంటి ప్రశ్నలు అనేకం ఉత్పన్నం అవుతున్నాయి. ఈ విషయంలో ఈ రోజు సమావేశం జరగనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. జులై 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆన్ లైన్ క్లాసుల నేపథ్యంలో మార్గదర్శకాలు ముచ్చటించనున్నారు.

ఇంకా డిగ్రీ, పీజీ పరీక్షల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతానికి పాఠశాల విద్యార్థులందరికీ ఆన్ లైన్ క్లాసులే తీసుకోవాలని నిర్ణయించారు. బోధన సిబ్బందిలో 50శాతం మంది పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుందని ఇంతకుముందే చెప్పారు. ఆన్ లైన్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేనివారికి క్లాసుల నిర్వహణ ఎలా ఉంటుందన్న విషయంలోనూ నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news