రెచ్చగొడితే రెచ్చిపోం..నీటి చుక్కను వదులుకోం : సజ్జల ఘాటు వ్యాఖ్యలు

-

గుంటూరు : జల వివాదంపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలపై ఏది మాట్లాడిన సమస్య పరిష్కారం కోసం మాట్లాడాలని… మనవి రెండు దేశాల కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలేనని స్పష్టం చేశారు. కానీ… రెచ్చగొడితే ఏపీ నాయకులు రెచ్చిపోరని..అలాగే నీటి చుక్కను వదులుకోబోమని పేర్కొన్నారు సజ్జల. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్ని చేస్తామని… కేంద్రం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు.

హూంకరించాల్సిన అవసరం లేదని… ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశామని పేర్కొన్నారు. జల వివాదంపై ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతామని.. ఎవరికి ఇబ్బంది కల్గించకుండా మన ప్రయోజనాలు కాపాడతామని వెల్లడించారు సజ్జల.

సీఎం జగన్ తండ్రిని ‌మించిన తనయుడు అని.. రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని…రెండు రోజులలో ఐదు లక్షల ఇళ్లకు శంఖుస్థాపన జరిగిందన్నారు. వై.ఎస్.ఆర్. తలపెట్టిన ఇళ్ల నిర్మాణం దేశంలోనే రికార్డు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో పిచ్చుక గూళ్ళు కట్టారని..అందులోనూ అవినీతికి పాల్పడ్డారని టీడీపీకి చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news